Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ ఒకటి. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. విడుదలకు ఇంకా నెల రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ పాల్గోంటుంది కల్కి టీమ్. ఇప్పటికే భైరవ (ప్రభాస్) బుజ్జి ఈవెంట్‌ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించగా ఈ ఈవెంట్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ మొదటివారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.