Kalki 2898 AD | ‘కల్కి 2898’ సినిమా రూ.1000 కోట్లను చేరుతుందా?
Kalki 2898 AD | కల్కి, ప్రభాస్, నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్. ప్రస్తుతం ఎక్కడా విన్నా కల్కి 2898 ఏడీ గురించే చర్చ జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
Kalki 2898 AD | కల్కి, ప్రభాస్, నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఈ మూడు పేర్లు హాట్‌టాపిక్. ప్రస్తుతం ఎక్కడా విన్నా ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే కేవలం విదేశాల్లోనే ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూలు చేస్తుందని చెబుతున్నాయి సినీ వర్గాలు.
ఈ చిత్ర విజయంలో కీలక భూమిక పోషించిన నాగ్ అశ్విన్, ప్రియాంకదత్, స్వప్నదత్‌లు మాత్రం సినిమా కలెక్షన్ల కంటే ముఖ్యంగా ఓ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు అందించామనే సంతృప్తి మాకు ముఖ్యమని చెబుతున్నారు. ఈ చిత్రం వసూళ్లు ఈ స్థాయిలో వుండటానికి కారణం ప్రభాస్ లాంటి యూనివర్సల్ స్టార్ ఈ సినిమాలో హీరోగా వుండటం, అమితాబచ్చన్, కమల్‌హాసన్ లాంటి గొప్ప నటులు నటించడం, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరో కీలక పాత్రలో కనిపించడం ఇవన్నీ ఒకెత్తు అయితే.. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో వున్న ఈ చిత్రం మేకింగ్‌లోని ప్రతి సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు.
ముఖ్యంగా చిత్రంలో వున్న హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రానికి సమయం కూడా కలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీగా మారింది. సినిమాలో కీలకంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అలరించే అంశాలు ఈ చిత్రంలో వుండటం కూడా మరో కారణం.
యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం తరువాత థియేటర్లు ప్రేక్షకులతో కళ కళలాడుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు లేక, సరైన కంటెంట్‌తో సినిమాలు రాక విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతితో పాటు మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి అత్యంత భారీ విజయాన్ని అందించారు. ఈ కలెక్షన్ల సునామీ రూ.1000 కోట్లకు పైగా చేరుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
-
Assam Floods | వరదలకు అస్సాం అస్తవ్యస్థం.. 52కు పెరిగిన మృతులు.. 21 లక్షల మందిపై ప్రభావం
-
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్
-
Ambati petition | నాకు ప్రాణ హాని ఉంది.. మాజీ మంత్రి అంబటి రాంబాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

