Home
Andhrapradesh-news
I Am In Danger Of Life Former Minister Ambati Rambabus Petition In The High Court
Ambati petition | నాకు ప్రాణ హాని ఉంది.. మాజీ మంత్రి అంబటి రాంబాబు
Ambati petition | తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి : తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) ఏపీ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ల (Gunmens) భద్రతను యధావిధిగా కొనసాగించాలని కోరారు. భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో అంబటి పిటిషన్ వేశారు.
భద్రత పునరుద్ధరణపై పల్నాడు ఎస్పీ, డీజీపీకి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని వాపోయారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఇరువాదనలు విని తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

