Kannappa Movie | మంచు విష్ణు ‘కన్నప్ప’లో స్టార్ నటి.?
Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Kannappa Movie | మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. తాజాగా మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఇప్పటికే మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అగ్ర నటి ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో సౌత్ ఇండియా స్టార్ నటి కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకుముందు విష్ణు, కాజల్ కలిసి మోసగాళ్లు అనే సినిమాలో నటించారు. ఇక కన్నప్ప విషయానికి వస్తే.. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇండియాకు తిరిగొచ్చింది. తాజా సమాచారం ప్రకారం మేలో మొదలయ్యే తాజా షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

