KA Movie OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Kiran Abbavaram | తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది 'క' చిత్రం.
Kiran Abbavaram | తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది ‘క’ (KA Movie) చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సినిమా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. ఈ ఆనందం రోజూ ఉండాలని, తనో పోస్ట్‌మ్యాన్ కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ అలవాటులో భాగంగా శరణాలయం వార్డెన్ ఉత్తరం చదువుతూ వార్డెన్‌కి దొరికిపోతాడు. అతను వాసుదేవ్‌ని కొట్టి, మందలించి వదిలిపెట్టేస్తాడు. ఓ రోజు వార్డెన్ దగ్గరున్న డబ్బును దొంగిలించి, శరణాలయం నుంచి పారిపోతాడు వాసుదేవ్. తన కూతురు ఆపరేషన్‌కోసం వార్డెన్ దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బు పోవడంతో వార్డెన్ షాక్‌కి గురవుతాడు. ఆపరేషన్ జరగకపోవడంతో అతని కూతురు చనిపోతుంది. ఇవేమీ పారిపోయిన వాసుదేవ్‌కి తెలీదు. తాను ఆ డబ్బుతో వేరే ఊరు చేరుకొని తన ఆశయసాధన కోసం టెన్త్ వరకూ చదువుపూర్తి చేస్తాడు. కృష్ణగిరి అనే ఊళ్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి, ఆ ఊరు చేరుకుంటాడు. ఇక అక్కడ ఎదురైన పరిణామాలేంటి? అసలు వాసుదేవ్ ఆ జైల్లో ఎందుకు పడ్డాడు? అతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

