Rajinikanth | గ్రాండ్‌ఫాదర్ డ్యూటీని ఫుల్‌ఫిల్ చేసిన రజినీకాంత్.. మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవ
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) గ్రాండ్‌ఫాదర్ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేశారు (Fulfilling Grandfather Duties). స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని స్వయంగా తీసుకెళ్లారు.
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఎంత సింపుల్ లైఫ్‌ను లీడ్ చేస్తారో అందరికీ తెలిసిందే. నిత్యం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ స్టార్ హీరో.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో విలువైన సమయాన్ని గడుపుతుంటారు. ఇప్పుడు తాజాగా గ్రాండ్‌ఫాదర్ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేశారు (Fulfilling Grandfather Duties). స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మనవడిని స్వయంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రజినీ కుమార్తె సౌందర్య (Soundarya Rajinikanth ) ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
ఇవాళ ఉదయం తన కుమారుడు వేద్ (Ved) పాఠశాలకు వెళ్లనని మారాం చేసినట్లు తెలిపారు. అప్పుడు సూపర్ హీరో (రజినీకాంత్‌ను ఉద్దేశిస్తూ) స్వయంగా వేద్‌ని పాఠశాలకు తీసుకెళ్లినట్లు చెప్పారు. ‘ఆఫ్ స్క్రీన్‌లో అయినా ఆన్ స్క్రీన్‌లో అయినా ప్రతి పాత్రనూ మీరు ఉత్తమంగా పోషిస్తారు నాన్నా..’ అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్‌కు తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తున్న ఫొటోలను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికొస్తే.. తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’ (Coolie Movie). సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అదేవిధంగా రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం ‘వేట్టయాన్’ (Vettayan Movie). ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వ్యవస్థలోని అన్యాయాలు, అక్రమాలపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నదే ఈ సినిమా కథాంశమని చిత్ర బృందం పేర్కొంది. కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, అభిరామి, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.
Also Read..
Kargil Vijay Diwas | కార్గిల్ విజయ్ దివస్.. యుద్ధ వీరులకు రాష్ట్రపతి ముర్ము నివాళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

