యష్‌రాజ్ ఫిలింస్ బ్లాక్‌బస్టర్ ‘వార్’కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రానున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ పూర్తయింది. హృతిక్ రోషన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు ఎన్టీఆర్. తొలుత ఆయనపై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ యాక్షన్ ఎపిపోడ్‌లో హృతిక్‌రోషన్ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. దాదాపు నెలరోజుల పాటు జరిగే నాన్‌స్టాప్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు. ఫిబ్రవరిలోగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ‘వార్-2’ సెట్స్‌లో జాయిన్ కావడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రంగా ‘వార్-2’ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నది.