Jordar sujatha | కూతురి అన్నప్రాసన వేడుక.. ఫుల్ ఖుషీగా కనిపించిన జోర్ధార్ సుజాత
Jordar sujatha జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా స్కిట్లు చేసి తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే రాకేష్ తన తోటి ఆర్టిస్ట్‌తో కలిసి బుల్లితెరపై కామెడీ చేస్తున్న నేపథ్యంలోనే ఇతనికి జోర్దార్ సుజాతతో పరిచయం ఏర్పడింది.
Jordar sujatha జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా స్కిట్లు చేసి తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే రాకేష్ తన తోటి ఆర్టిస్ట్‌తో కలిసి బుల్లితెరపై కామెడీ చేస్తున్న నేపథ్యంలోనే ఇతనికి జోర్దార్ సుజాతతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరికి కాంబోలో వచ్చిన ఎన్నో స్కిట్లు ప్రజాదరణ పొందాయి. ఇక రోజు రోజుకి వీరిద్దరి మధ్య బాండింగ్ బలపడడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రాకేష్- జోర్దార్ సుజాతలు పెద్దల అనుమతితో2023 ఫిబ్రవరి 24న తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడడుగులు వేశారు . వారి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది అక్టోబర్ లో ఖ్యాతిక వీరి ఇంట్లోకి అడుగు పెట్టింది. గతేడాది నవంబర్ లోనే ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కూతురు పుట్టిన తర్వాత చాలా సందర్భాలలో బయట కనిపించినప్పటికీ ఎప్పటికప్పుడు కూతురు ఫేస్ ని దాచి పెడుతూ వచ్చారు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా కూతురు ఫేస్ రివీల్ చేశారు రాకేష్ దంపతులు. ఇక రాకేష్ సుజాత దంపతులు కూతురుకి అన్నప్రాసన వేడుకను నిర్వహించగా, ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
‘మా పాప తొలి పండుగ అంటూ ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్యూట్, పాప చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా రాకింగ్ రాకేష్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. మరోవైపు సుజాత మాత్రం పాపను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటోంది. అడపాదడపా మాత్రమే పలు షోలలో మెరుస్తుంది. సుజాత కెరీర్ బిగినింగ్‌లో న్యూస్ ప్రజెంటర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సుజాత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

