Jogendra Ganesh idol | ‘జోగేంద్ర’ గణేశుడు రెడీ..నెట్టింట ఫొటో హల్ చల్
రానా (Rana Daggubati) నటించిన చిత్రాల్లో మంచి బ్రేక్ అందుకున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ చిత్రంలో రానా చేసిన జోగేంద్ర పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా చాలా రోజుల తర్వాత జోగేంద్ర జనాల మధ్యకు రాబోతున్నాడు.
నేనే రాజు నేనే మంత్రి (Nene Raju Nene Mantri)..తేజ డైరెక్షన్లో రానా, కాజల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. రానా (Rana Daggubati) నటించిన చిత్రాల్లో మంచి బ్రేక్ అందుకున్న సినిమా. ఈ చిత్రంలో రానా చేసిన జోగేంద్ర పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా చాలా రోజుల తర్వాత జోగేంద్ర జనాల మధ్యకు రాబోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా..? త్వరలో గణేశ్ చతుర్థి నేపథ్యంలో వివిధ ఆకారాల్లో వినాయకుడి ప్రతిమలు ముస్తాబవుతున్నాయి.
అందులో ఒకటి జోగేంద్ర (Jogendra)పాత్రను స్పూర్తిగా తీసుకుని తయారు చేస్తున్న గణేశుడి విగ్రహం. సంప్రదాయక చొక్కా, పంచ వస్త్రధారణలో జోగేంద్రను పోలిన గణేశుడి స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. బేగంబజార్‌లోని బర్టన్ బజార్లో ఫ్రెండ్స్ క్లబ్ ఇలా సినిమాటిక్ గా గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఇంకా పూర్తిస్థాయిలో తయారు కానీ జోగేంద్ర గణేశుడు విగ్రహాం ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 31న గణేశ్ చతుర్థిని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న నిమజ్జనం చేయనున్నారు.
సినిమా కారెక్టర్లతో వినాయక ప్రతిమలు మార్కెట్లో దర్శనమివ్వడం కొత్తేమీ కాదు. బాహుబలి, ఈగ, గబ్బర్ సింగ్ సినిమాల పాత్రల స్పూర్తిగా తయారు చేసిన గణేశుడి విగ్రహాలు ఇప్పటికే మార్కెట్లో సందడి చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

