jessie in bigg boss 5 telugu | అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బిగ్ బాస్ షో విషయంలో ఈ పాట ఎప్పుడూ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ ట్విస్టులు ఇవ్వడం బిగ్ బాస్‌కు బాగా అలవాటు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిన్నటికి నిన్న అనారోగ్యం కారణంగా నామినేషన్స్‌లో కూడా లేని జెస్సీని బయటకు పంపించేశాడు బిగ్ బాస్. దాంతో ఈయన ఇంక రాడు.. అనధికారికంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఉండకపోవచ్చని ఒక అంచనాకు వచ్చారు. కానీ చివరి నిమిషంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.. జెస్సీ బయటికి వెళ్లలేదు.. సీక్రెట్ రూమ్ లోనే ఉన్నాడు. దాంతో ఈవారం ఎలిమినేషన్ యథావిధిగా జరగడం ఖాయం అయిపోయింది.
ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా మానస్, కాజల్ వైపు కనిపిస్తున్నాయి. సన్నీ తన ఆటతో భారీగానే అభిమానులను సంపాదించుకున్నాడు. దాంతో ఓటింగ్ కూడా ఆయనకు అత్యద్భుతంగా ఉంది. ఆ తర్వాత యాంకర్ రవి ఎప్పట్లాగే మంచి ఓటింగ్‌తో ముందుకు వెళుతున్నాడు. షణ్ముఖ్ జస్వంత్ ఫాలోవర్స్ అందరూ సిరికి ఓట్లు గుంపగుత్తగా గుద్దేస్తున్నారు. దాంతో ఈ వారం కాజల్, మానస్ డేంజర్ జోన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం మానస్ చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ఇక కాజల్ చివరి స్థానంలో ఉంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఇప్పుడు ఆమెకు పడుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కాజల్‌కి ఉన్నట్లు కనిపిస్తుంది. చివరి నిమిషంలో మళ్లీ బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తే తప్ప ఈ వారం ఇంటి నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయటికి రావడం దాదాపు ఖాయం అయిపోయింది. పైగా గత కొన్ని వారాలుగా కాజల్ గేమ్ కూడా అంతగా ఏం లేదు. ఇది కూడా ఆమె ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss: అందరిని పిచ్చోళ్లని చేసి జెస్సీని సీక్రెట్ రూంకి పంపిన బిగ్ బాస్
Kajal: కాజల్‌ని దూరం పెట్టిన సన్నీ, మానస్.. క్షమాపణలు చెప్పిన కరగని సన్నీ
Priyanka: ప్రియాంక ప్రవర్తనతో విసిగిపోతున్న ప్రేక్షకులు..!
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Gangavva: కొత్తింట్లోకి గంగవ్వ.. గృహప్రవేశానికి హాజరైన అఖిల్, శివజ్యోతి