Priyanka: ప్రియాంక ప్రవర్తనతో విసిగిపోతున్న ప్రేక్షకులు..!

బిగ్ బాస్ గేమ్ రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌లకి హౌజ్మేట్సే కాదు ప్రేక్షకులు కూడా బిత్తరపోతున్నారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్ గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. సన్నీ-మానస్లు ఓ చోట కూర్చొని నామినేషన్స్ విషయంలో కాజల్ తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. ఉంటే కలిసి ఉందాం.. పీకితే కలిసే పీకుదాం.. ఫైట్ చేద్దాం.. మనల్ని సేవ్ చేయకూడదని కాజల్ అనుకుంది.. చివరికి దేవుడు ఏం చేశాడో చూశాం కదా.. నామినేషన్స్ అనేది గేమ్ కాదు.. బయటకు పంపే ప్రక్రియ దాన్ని సిల్లీగా తీసుకోకూడదు అని మానస్‌తో చెప్పాడు సన్నీ.
ఇక మానస్ వెనక ప్రియాంక తిరుగుతూ కనిపించింది. మానస్‌కే చిరాకు పుట్టి నాకు కావాల్సింది నేను పెట్టుకుంటా.. నువ్ పెట్టాల్సిన పనిలేదని పింకీపై అసహనం వ్యక్తం చేశాడు మానస్. ఆ తరువాత మళ్లీ ప్రియాంక.. తింటున్న మానస్ దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా మానస్.. పెరుగు అన్నం తీసుకుని రానా? అని అడిగింది. వద్దుని చెప్పాడు మానస్.
కొంచెం తిను మానస్ అంటే నాకు కావాలనిపిస్తే నేను పెట్టుకుంటా.. అని చెప్పాడు. దీంతో నేను ఏమైనా మిస్టేక్ చేశానా? అని ప్రియాంక అడగడంతో.. తింటున్నా తరువాత మాట్లాడతా అని చెప్పాడు మానస్. అయితే ఇదంతా గమనించిన సన్నీ.. పింకీతో మాట్లాడి పరిస్థితి గురించి చెప్పు అంతే తప్ప సడెన్‌గా దూరం పెట్టకు అని చెప్పాడు. ఈ ఎపిసోడ్లో పింకీని చూసి ప్రేక్షకులకే చిరాకు పుట్టింది. ఈమె బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చిందా, మానస్ వెనక పడడానికి వచ్చిందా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

