Ramcharan| రామ్ చరణ్ తో ‘జెర్సీ’ దర్శకుడి ఎమోషనల్ జర్నీ
జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి సినిమా చూసినా చాలు ఆ దర్శకుడికి వచ్చే గుర్తింపు వేరు. అలాంటి గుర్తింపు రెండో సినిమాతోనే తెచ్చుకున్నాడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri).

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు చేశాను అనేది కీలకం. జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి సినిమా చూసినా చాలు ఆ దర్శకుడికి వచ్చే గుర్తింపు వేరు. అలాంటి గుర్తింపు రెండో సినిమాతోనే తెచ్చుకున్నాడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri). విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. మళ్లీ రావా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్.. నాని హీరోగా జెర్సీతో టాలీవుడ్ (Tollywood) లో సంచలనం సృష్టించాడు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ప్రతి సినిమాలో హీరో చివరిలో కచ్చితంగా గెలుస్తాడు. కానీ జెర్సీలో మాత్రం ఓడిపోతూ గెలుస్తాడు. చనిపోయిన తర్వాత కూడా అందరి హృదయాల్లో బతికే ఉంటాడు.
అలాంటి ఒక కథను చెప్పడం చిన్న విషయం కాదు. ఎంతో ఎమోషనల్ గా అందరి కళ్లలో తడి వచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించి ఔరా అనిపించాడు గౌతమ్. ఇప్పుడు జెర్సీ సినిమా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమా రామ్ చరణ్ (Ramcharan) తో ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల నుంచి దీనిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రామ్ చరణ్ ఇమేజ్ కు సరిపోయేలా ఒక ఎమోషనల్ కథను సిద్ధం చేశాడు గౌతమ్ తిన్ననూరి. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటూనే.. మరోవైపు తన మార్క్ ఎమోషన్ కూడా మిస్ కాకుండా గౌతమ్ ఈ కథ రాసినట్లు తెలుస్తోంది. సింగిల్ సిట్టింగ్ లోనే గౌతమ్ తిన్ననూరి కథకు రామ్ చరణ్ కూడా ఫ్లాట్ అయిపోయాడని.. ఎలాంటి మార్పులు లేకుండానే కథకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్..ఆ తర్వాత శంకర్ సినిమాతో బిజీ కానున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో గౌతమ్ తిన్ననూరి సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎప్పుడూ చేయనంత ఎమోషనల్ క్యారెక్టర్ ఇందులో చేయబోతున్నట్లు తెలుస్తోంది. జెర్సీలో నాని క్యారెక్టర్ చూసిన తర్వాత గౌతమ్ రైటింగ్ స్కిల్స్ ఏంటో అందరికీ అర్థమయ్యాయి. దాంతో చరణ్ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

