Siren Movie | రివెంజ్ తీర్చుకునేందుకు వస్తున్న జయం రవి.. ‘సైరన్’ టీజర్ రిలీజ్
Siren Movie | పొన్నియిన్ సెల్వన్, ఇరైవన్ చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సైరన్ (Siren).
Siren Movie | ‘పొన్నియిన్ సెల్వన్’, ‘ఇరైవన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలను సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2 సినిమా చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరన్’ (Siren). కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్, సైరన్ ప్రీఫేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
దీపావళి పండగ కానుకగా సైరన్ నుంచి మేకర్స్ టీజర్ వదిలారు. కీర్తి సురేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగిన ఈ టీజర్లో జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు. జయం రవి జైలు నుంచి విడుదలైన అనంతరం తన ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ ప్రోమోలో జయం రవి రగ్గడ్ లుక్‌లో అలరించాడు. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది.
ఈ చిత్రంలో జయం రవి, కీర్తి సురేష్‌తో పాటు, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, తులసి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: సెల్వ కుమార్ ఎస్.కె, ఎడిటింగ్: రూబెన్. స్టంట్ కొరియోగ్రఫీ దిలీప్ సుబ్బరాయన్. సుజాత విజయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో థియేటర్లలోకి రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

