Ram Charan | చరణ్ బర్త్‌డేని వెరైటీగా సెలబ్రేట్ చేసిన జపనీస్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలంటూ డిమాండ్
Ram Charan |ఈ రోజు రామ్ చరణ్ 40వ బర్త్ డే సందర్భంగా అక్కడ చాలా మంది అభిమానులు రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసి ఆనందం వ్యక్తం చేసారు. అంతే కాకుండా గేమ్ ఛేంజర్ ని కూడా అక్కడ రిలీజ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తుండడం గమనార్హం
Ram Charan | జపనీస్ తెలుగు హీరోలపై తెగ ప్రేమని పెంచేసుకుంటున్నారు. బాహుబలి సమయంలో ప్రభాస్‌పై అమితమైన ఇష్టాన్ని చూపించారు. కొందరు ఫ్యాన్స్ అయితే ప్రభాస్‌ని కలిసేందుకు ఏకంగా హైదరాబాద్‌కి వచ్చారు. ఇక దేవర’ జపాన్ లో రిలీజ్ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీసమేతంగా ఆ దేశంకి వెళ్లగా అక్కడి ప్రజలు తారక్‌పై చూపిస్తున్న ప్రేమకి ఫిదా అయిపోయారు. రీసెంట్గా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశాడు. జపాన్ వెళ్లిన ప్రతీసారి నాకు బ్యూటీఫుల్ మెమోరీస్ లభిస్తాయి. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఒక అభిమాని ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసాక తెలుగు నేర్చుకున్నట్లు చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌కి కూడా గ్లోబల్‌గా మంచి క్రేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌తో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీని జపాన్ దేశంలో విడుదల చేశారు. ఈ చిత్రంకి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ గేమ్ ఛేంజర్‌ని జపాన్‌లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ రోజు రామ్ చరణ్ 40వ బర్త్ డే సందర్భంగా అక్కడ చాలా మంది అభిమానులు రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసి ఆనందం వ్యక్తం చేసారు. అంతే కాకుండా గేమ్ ఛేంజర్ ని కూడా అక్కడ రిలీజ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు పెద్ది అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ రోజు సినిమాలో రామ్ చరణ్ లుక్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా, ఇది ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ కూడా సహకారం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో మూవీ తెరకెక్కుతుందని సమాచారం.
WE LOVE CHARAN…
Man of Masses #RamCharan’s Japan fans celebrated his 40th birthday with a special screening, honoring our Global Star with love and admiration! ❤️🎉#HBDRamCharan @AlwaysRamCharan pic.twitter.com/cl2Km8B6ld
— WC (@whynotcinemasHQ) March 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- game changer
- Japan
- peddi
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

