Japan Movie | కెరీర్ మొదట్లో డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న కార్తి.. ఆ తర్వాత ఊపిరితో తెలుగు స్ట్రైయిట్ సినిమా చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లు గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ఇక గతేడాది హ్యట్రిక్ హిట్స్ సాధించిన కార్తి.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ సినిమా చేస్తున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి పండక్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు గట్రా సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
పదేళ్ల వయసు నుంచే దొంగతనాలు చేస్తూ పెరిగిన జపాన్.. పాతికేళ్లకు గజదొంగల మారిపోతాడు. చిల్లర కొట్టేసే దగ్గర నుంచి వందల కోట్లు కొట్టేసే స్థాయికి ఎదుగుతాడు. పోలీసులకు చిక్కకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఓ సారి ఏకంగా మినిస్టర్‌కు చెందిన నగల కొట్టులో రెండొందల కోట్లు విలువ చేసే బంగారపు సొత్తును దోచుకెళ్తాడు. పైగా ఒకరిని హత్య కూడా చేస్తాడు. అదే టైమ్‌లో జపాన్ను పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్ అలియాస్ సునీల్ రంగంలోకి దిగుతాడు. ఇక వాళ్లకు దొరక్కుండా జపాన్ ఎలా తప్పించుకున్నాడు అనే విధంగా పండు ఒలిచి ఇచ్చినట్లు ట్రైలర్లోనే స్టోరీ థీమ్‌ను ప్రజెంట్ చేశారు.
మరీ ముఖ్యంగా చేజింగ్ సీన్లు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఇక కార్తి కూడా రెగ్యులర్‌గా కాకుండా కాస్త కొత్త మాడ్యులేషన్‌తో డైలాగ్స్ చెప్పాడు. నిర్మాతలు సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టినట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉంది. సునీల్‌కు సాలిడ్ రోల్ పడ్డట్లు తెలుస్తుంది. అనుఇమాన్యుయేల్తో లవ్‌స్టోరీ బలంగా ఉండబబోతున్నట్లు కనిపిస్తుంది. చూస్తుంటే దీపావళికి సరైన ఎంటర్టైనర్ రాబోతుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు పోటీగా జిగార్తండ, ఆదికేశవ, టైగర్ సినిమాలు రానున్నాయి. మరీ ఈ ముగ్గరిను దాటుకుని జపాన్ సొత్తను ఎత్తుకుపోతాడా లేదా అనేది చూడాలి.