Japan Movie | ‘జపాన్’ మూవీ ఈవెంట్లో కార్తీ, తమన్నా డ్యాన్స్.. ట్రెండింగ్‌లో కార్తీ తండ్రి.!
Japan Movie | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ జపాన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Japan Movie | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ జపాన్ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథులుగా లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, కె.ఎస్.రవికుమార్, పా.రంజిత్, హెచ్.వినోద్, సుశీంద్రన్, ముత్తయ్య, సిరుత్తై శివ, సత్యరాజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేక అతిథిగా విచ్చేసి జపాన్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ విడుదల అనంతరం.. కార్తీ, తమన్నా(Karthi, Tamanna) కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ ఆవారా (Aawara) మూవీలోని ”అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన” పాటకు కార్తీ, తమన్నా కలిసి స్టెప్పులేయగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఈ డ్యాన్స్ వలన సూర్య, కార్తీల తండ్రి నటుడు శివ కుమార్ (Shiva Kumar) ట్రెండింగ్‌లోకి వచ్చాడు.
కార్తీ, తమన్నా కలిసి చేసిన డ్యాన్స్‌కు ఓ నెటిజన్ తుపాకి సినిమాలోని మీమ్ జోడిస్తూ.. శివ కుమార్ వలనే కార్తీ లవ్ మ్యారేజ్ చేసుకోక.. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఒక ఫన్నీ మీమ్ క్రీయేట్ చేశారు. ఇక ఈ వీడియోలో శివ కుమార్ మాట్లాడుతూ.. మన ఇంట్లో ఆల్రెడీ ఒక లవ్ మ్యారేజ్(సూర్య, జ్యోతిక) అయిపొయింది. కార్తీ నువ్వు అయిన మీ అమ్మకి నచ్చిన.. మన కాస్ట్ అమ్మాయిని చేసుకోని మంచిగా చూసుకోరా.. అంటూ శివ కుమార్ అంటాడు. దీంతో ఈ వీడియోకి తుపాకి సినిమాలోని మీమ్ యాడ్ చేసి మీమర్స్ ఆడుకుంటున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sivakumar ayya 😹🔥pic.twitter.com/jvtZhPyuOs
— Loki | Alter Ego (@ThzLokii) October 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

