Japan Movie | తమిళం కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తీ. ఇతని మూవీలు విడుదల అవుతున్నాయంటే చాలు తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయాడు కార్తీ. ఇక కార్తీ (Karthi) హీరోగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటించింది. రాజమురుగన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే.. ఈ మూవీకి సంబంధించి మొదట ఒక తమిళ ఆడియోను మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఈ సినిమా తెలుగులో చూద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు కన్నడ, మలయాళం వెర్షన్ లను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక జపాన్ను తెలుగులో చూడాలనుకునేవారు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చూసేయచ్చు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు ఈ మూవీని నిర్మించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.