Japan Movie | కార్తీ ‘జపాన్’ టీం ఎలా కష్టపడ్డారో చూడండి.. మేకింగ్ వీడియో
Japan Movie | తమిళం కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తీ. ఇతని మూవీలు విడుదల అవుతున్నాయంటే చాలు తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయాడు కార్తీ. ఇక కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జపాన్' (Japan).
Japan Movie | తమిళం కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తీ. ఇతని మూవీలు విడుదల అవుతున్నాయంటే చాలు తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయాడు కార్తీ. ఇక కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జపాన్’ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో కార్తీ వాయిస్ మూవీకే హైలైట్ అని అభిమానులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘జపాన్’ మేకింగ్ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘ది జర్నీ ఆఫ్ గోల్డెన్ స్టార్ జపాన్’ (The Journey Of Golden Star Japan) అని విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే.. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా నవంబర్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

