Janhvi Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి వేడుకకు హాజరైనా తన స్టైలిష్ లుక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే జాన్వీ, తాజాగా తన సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో మెరిసిపోయింది. అయితే ఈసారి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కంటే చేతికి ధరించిన ఖరీదైన లగ్జరీ వాచ్‌నే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అన్షులా కపూర్ మెహందీ వేడుకలో జాన్వీ బ్లష్ పింక్ కలర్ వన్-షోల్డర్ గౌన్‌లో అందంగా కనిపించింది. సింపుల్‌గా కనిపించినా ఎంతో రాయల్ లుక్ ఇచ్చే ఈ డ్రెస్‌కు ఆమె ఎంచుకున్న యాక్సెసరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆమె చేతికి కనిపించిన లగ్జరీ వాచ్ విలువ తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వేడుకలో జాన్వీ ధరించిన వాచ్ ప్రముఖ స్విస్ లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్‌కు చెందిన గోండోలో హాట్ క్లేర్ పెర్ల్ మోడల్ అని ఫ్యాషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అరుదైన టైమ్‌పీస్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం. వాచ్ ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాచ్ ప్రత్యేకత దాని అద్భుతమైన డిజైన్లోనే ఉంది. ఇందులోని డయల్‌పై 251 మెరిసే వజ్రాలు పొదిగారు. అలాగే స్ట్రాప్‌పై 79 అకోయా ముత్యాలు, ప్రిన్సెస్-కట్ డైమండ్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన డయల్ ప్లేట్‌కు డైమండ్ ఫినిషింగ్ ఇవ్వడంతో ఈ టైమ్పీస్కు మరింత రాయల్ లుక్ వచ్చింది.
వాచ్‌కు మ్యాచ్ అయ్యేలా జాన్వీ ధరించిన బ్లష్ పింక్ గౌన్ కూడా ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది. మింట్ గ్రీన్, పౌడర్ బ్లూ, పీచ్ రంగుల ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌కు ఒక భుజం నుంచి కిందకు జారే డ్రేప్, ఫ్రింజ్ టాసెల్స్ ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. సంప్రదాయ చీరను గుర్తు చేసేలా మోడ్రన్ టచ్‌తో రూపొందించిన ఈ గౌన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లుక్‌ను పూర్తి చేయడానికి జాన్వీ గ్రీన్ కలర్ జుమ్కాలు, సాఫ్ట్ మేకప్, ఓపెన్ హెయిర్ వేవ్స్‌ను ఎంచుకుంది. దీంతో ఆమె స్టైలిష్ లుక్కు అభిమానులతో పాటు ఫ్యాషన్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.