Janhvi Kapoor | మధురానగర్ హనుమాన్ ఆలయంలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవ భక్తి అధికమే. తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ మెట్ల మార్గంలో నడుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.
Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవ భక్తి అధికమే. తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ మెట్ల మార్గంలో నడుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆమె హైదరాబాద్‌లోని మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అరగంట సేపు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్వీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు.
జాన్వీ కపూర్ తెలుగులో నటించిన తొలి సినిమా దేవరతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మంచి వసూళ్లను సాధించింది. తాజాగా తెలుగులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. మరో బంపరాఫర్ ఆమె తలుపు తట్టినట్లు తెలుస్తున్నది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈరం (వైశాలి) సినిమా హిందీ రీమేక్‌కు జాన్వీ ఓకే చెప్పినట్లు సినీవర్గాల టాక్. 2009లో విడుదలైన ఈ తమిళ సినిమాను డైరెక్టర్ శంకర్ నిర్మించగా, అరివళగన్ దర్శకత్వం వహించారు. హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీనిద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస దర్శకుడిగా పరిచయం కానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

