సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్-2’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా నుంచి బాలీవుడ్ భామ నోరా ఫతేహీ నర్తించిన ‘బిందాస్’ అనే ఐటెంసాంగ్‌ని విడుదల చేశారు.
అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సూపర్సుబ్బు లిరిక్స్ అందించారు. హుషారైన న బీట్, జోష్ పెంచే స్టెప్పులతో ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.