రాముడికి ఇచ్చిన మాట కోసం!
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్'కి సీక్వెల్‌గా వస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ ‘జై హనుమాన్'. సప్త చిరంజీవుల మేళవింపుతో కూడిన కథాంశంతో హాలీవుడ్ ‘అవెంజర్స్'ని తలపించేలా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ వెండితెర అద్భుతానికి కథానాయకుడు ‘కాంతార’ఫేం రిషబ్‌శెట్టి.
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్‌గా వస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ ‘జై హనుమాన్’. సప్త చిరంజీవుల మేళవింపుతో కూడిన కథాంశంతో హాలీవుడ్ ‘అవెంజర్స్’ని తలపించేలా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ వెండితెర అద్భుతానికి కథానాయకుడు ‘కాంతార’ఫేం రిషబ్‌శెట్టి. ఇందులో ఆయన వీరాంజనేయుడిగా కనిపించబోతున్నారు. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నారు. ఆ పాత్ర వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచింది. ఇక శుక్రచార్యుడిగా అక్షయ్ఖన్నా.. ఇలా వివిధ పాత్రల్లో దేశంలోని పేరెన్నికగన్న తారలంతా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్‌ని పూర్తిచేసుకున్నది. మలి షెడ్యూల్ బుధవారం నుంచి మొదలైంది. రిషబ్‌శెట్టి, రానా, అక్షయ్ఖన్నాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్తున్నారు. రాముడికిచ్చిన మాట కోసం హనుమంతుడు చేసిన యుద్ధమే ఈ సినిమా అని ఇన్సైడ్ టాక్. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈచిత్రానికి సంగీతం: గౌర హరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

