శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘భజరంగి-2’. ఏ హర్ష దర్శకుడు. ఈ చిత్రాన్ని ‘జై భజరంగి’ పేరుతో నిరంజన్ పన్సారి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పీడిత ప్రజలకు అండగా నిలిచే భజరంగి అనే యోధుడి పోరాటంతో ఆసక్తికరంగా సాగుతుంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదలచేస్తున్నాం’ అని తెలిపారు. శ్రీ బాలాజీ వీడియో సంస్థ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని..చంద్రముఖి, అరుంధతి తరహాలో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అన్నారు.