MLA Anirudh Reddy | తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని విజయవాడ వెళ్లు.. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే కౌంటర్
PawanKalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.
Pawan Telangana Remarks | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా “గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది” అని, “తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి” అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా, తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్.. నువ్వు 70 ఏళ్లు వచ్చినా కూడా ముఖ్యమంత్రి కాలేవు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ఒంటరిగా పోటీ చెయ్ అంటూ ఘాటుగా విమర్శించారు.
తెలంగాణ వాళ్ల నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఇతరులు బాగు పడొద్దు అనే ఉద్దేశం ఉంటే.. ఆంధ్ర వాళ్లు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారా? ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ సహా అన్ని రంగాల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అయినా మేము ఒక్క మాట కూడా అంటున్నామా? అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రకు డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ఉండేది, వ్యాపారం చేసుకునేది మాత్రం తెలంగాణలోనే. మాది నర దిష్టి అయితే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నారు? ఇక్కడ ఉన్నవన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండండి అని ఆయన సవాల్ విసిరారు. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. ఆయన OG సినిమా ఫ్లాప్ అయినా కూడా, ప్రొడ్యూసర్ బ్రతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూశా. కానీ, తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు, కాబట్టి క్షమాపణలు చెప్పాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

