Comedian Punch Prasad | కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే పంచ్ ప్రసాద్ గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గతేడాది రెండు కిడ్నీలు ఫేయిల్ అయి నడవలేని స్థితికి వచ్చాడు. ఇక తరచూ డయాలసిస్ చేయించుకుంటూ పంచ్ ప్రసాద్ కాలం వెల్లదీస్తున్నాడు. అయితే తాజాగా ప్రసాద్ ఆరోగ్యం పరిస్థితి మరింత విషమంగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు వెల్లడించాడు. పంచ్ ప్రసాద్ కు సర్జరీ అవసరమని, లేకపోతే ఏ క్షణం ఏమైనా జరగొచ్చని పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరించాడు.
ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పినట్లు నూకరాజు వెల్లడించాడు. కాగా సర్జరీ కోసం బాగా డబ్బు ఖర్చవుతుందని, దానికి ఆర్థికంగా డబ్బు సహాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నట్లు నూకరాజు వీడియోలో తెలిపాడు. ప్రసాద్ కు రెండు కిడ్నీలు పాడవడంతో వేరే సమస్యలు కూడా తనను వెంటాడుతున్నాయని, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుందని నూకరాజు చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే సర్జరీ చేస్తే తనకు ఎలాంటి ప్రమాదం లేదని, దానికోసం ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయవచ్చని ప్రసాద్ భార్య బ్యాంక్ డిటేయిల్స్, ఫోన్ పే నంబర్ ను వీడియోలో మెన్షన్ చేశాడు.