Jaani Master Wife Sumalatha | జానీ మాస్టర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నా భర్తను కావాలని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందంటూ లేడి డ్యాన్సర్‌పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది.
కొరియోగ్రాఫర్‌గా పని చేయటం కోసం నా భర్త దగ్గరకు వచ్చి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందంటూ సుమలత ఆరోపించింది. ఆ లేడి డ్యాన్సర్ ఐదేళ్లుగా తనకు నరకం చూపించిదంటూ వాపోయింది. ఆమె వలన తాను సుసైడ్ అటెంప్ట్ చేసేదాకా వెళ్లానని తెలిపింది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని.. తనను పెళ్లిచేసుకోవాలని వేధించేదని తెలిపింది. అలాగే ఈ విషయంలో జానీ మాస్టర్ నిర్దోషి అని తప్పకుండా బయటికి వస్తాడు. కోర్టు ప్రకటించేవరకు వెయిట్ చేయండి. అలాగే ఈ మధ్య చూస్తున్న న్యూస్ ఛానల్స్ జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నాడు అని వార్తలు ప్రచురిస్తున్నారు. ఆ వార్తలన్ని అబద్దం. అతడు నేరం అంగీకరించలేదు అంటూ సుమలత చెప్పుకోచ్చింది.
ALso Read..