Saakini Daakini: శాకిని- ఢాకినిలుగా నివేదా రెజీనా… ఇంట్రెస్టింగ్గా మూవీ టైటిల్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు సుధీర్ వర్మ(Sudheer Varma). ఆయన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఓ చిత్రం చేస్తుండగా, ఈ సినిమాని సురేష్ బాబు, గురు ఫిలింస్ కాంబినేషన్ లో రూపొందిస్తున్నారు. రెజీనా(Regina), నివేదా(Nivetha Thomas) కాంబినేషన్ లో తయారైన ఈ సినిమాకు శాకిని డాకిని(Saakini Daakini) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఓ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ దర్శకుడు ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు. చిత్రానికి శాకిని డాకిని అనే వెరైటీ టైటిల్ పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఊహించని విధంగా ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. మానవ రవాణా ముఠా నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. ఈ ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాతో పాటు నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. రవితేజ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

