స్వీయ దర్శకత్వంలో త్రినాథ్ కఠారి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ ఉపశీర్షిక. సాహితీ అవాంచ కథానాయిక. బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాంలో, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్ర, సీడెడ్‌లో రిలీజ్ చేస్తున్నాయి.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, నేటి యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయని, కథలోని సందేశం కూడా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, నిర్మాణ సంస్థ: సంజీవని ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం: త్రినాథ్ కఠారి.