వారందరి దీవెనలవల్లే ఇది సాధ్యమైంది
‘సరైన సమయంలో సరైన అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నా. నా ఎదుగుదలకు కారణం నా దర్శకులే. నా తప్పుల్ని కూడా ఇష్టపడ్డారు.. క్షమించారు.. తీర్చిదిద్దారు. వారి దీవెనల వల్లే ఇది సాధ్యమైంది. దర్శకత్వం అంటే ఇష్టం. అది బాధ్యత కూడా.
‘సరైన సమయంలో సరైన అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థాయిలో ఉన్నా. నా ఎదుగుదలకు కారణం నా దర్శకులే. నా తప్పుల్ని కూడా ఇష్టపడ్డారు.. క్షమించారు.. తీర్చిదిద్దారు. వారి దీవెనల వల్లే ఇది సాధ్యమైంది. దర్శకత్వం అంటే ఇష్టం. అది బాధ్యత కూడా. అందుకే కాస్త భయంగా ఉంది. ఏఆర్ రెహమాన్, ప్రకాశ్‌రాజ్, ఎస్జెసూర్య, శరవణన్ ఇంకా నా టెక్నికల్ టీమ్ అందరూ నన్ను నమ్మి పనిచేశారు. కళానిథిమారన్ నన్ను నమ్మి ఖర్చుపెట్టారు. ‘రాయన్’ మంచి సినిమా. తమిళ ఆడియన్స్‌తోపాటు తెలుగువాళ్లకు కూడా నచ్చుతుందని నా నమ్మకం.’ అని జాతీయ ఉత్తమనటుడు ధనుష్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాయన్’. కళానిథిమారన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ విడుదల చేయనుంది.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడారు. ‘ధనుష్ తనకోసం రాసుకున్న పాత్రను నాతో చేయించారు. ఆయన కోసం రాసుకున్న పాత్రను ఆయన దర్శకత్వంలో నేను చేయడం నా కెరీర్లో మరిచిపోలేని విషయం. బాధ్యతగా తీసుకొని ఈ పాత్ర చేశా.’ అని సందీప్‌కిషన్ తెలిపారు. మనకున్న నటుల్లో ధనుష్ అరుదైన నటుడని ప్రకాశ్‌రాజ్ కొనియాడారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కథానాయికలు అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కాళిదాస్ జయరామ్, డి.సురేశ్‌బాబు, దిల్‌రాజు, ఏషియన్ సునీల్, గోపీచంద్ మలినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

