Sreeleela | మరో క్రేజీప్రాజెక్ట్లో శ్రీలీల.. ప్రభాస్‌తో జతకట్టనున్న అందాల భామ!
శ్రీలీల ఖాతాలో మరో క్రేజీప్రాజెక్ట్ చేరిందని తెలుస్తున్నది. అది కూడా మామూలు ప్రాజెక్ట్ కాదు. త్వరలో ఈ అందాల భామ ప్రభాస్‌తో జతకట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.
Sreeleela | శ్రీలీల ఖాతాలో మరో క్రేజీప్రాజెక్ట్ చేరిందని తెలుస్తున్నది. అది కూడా మామూలు ప్రాజెక్ట్ కాదు. త్వరలో ఈ అందాల భామ ప్రభాస్‌తో జతకట్టనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం చేత ఆ వార్త కనుమరుగైంది. నిజానిక్కూడా ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడితో సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.
హను రాఘవపూడి కూడా అందుకు తగ్గ కథను సిద్ధం చేసుకునే పనిలో ఇన్నాళ్లూ నిమగ్నమయ్యాడు. అయితే ఇప్పుడు ఆ కథ ఓ కొలిక్కి రావటంతో హీరోయిన్ వేట మొదలుపెట్టాడంట హను రాఘవపూడి. ఇది ప్రేమకథ కావడంచేత, ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు ఓ బాలీవుడ్ భామను ఇందులో కథానాయికగా నటింపజేయాలనుకున్నాడట హను రాఘవపూడి. అయితే.. చివరకు ఆ అవకాశం శ్రీలీలను వరించినట్టు తెలిసింది. శ్రీలీలతో నటించటానికి ప్రభాస్ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో, ఇటీవలే శ్రీలీలకు దర్శకుడు కథ వివరించాడట. తనకు కూడా కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఖరారైనట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

