దృశ్యం 2 థియేటర్ సినిమా కాదని వెంకటేశ్ ముందే ఫిక్సయ్యాడా..?

Drushyam2 in OTT | తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్న హీరో ఈయన. అంతేకాదు సీనియర్ హీరోలలో అందరి కంటే ఎక్కువ సక్సెస్ రేటు ఉన్నది కూడా వెంకటేశ్‌కు మాత్రమే. ఈ మధ్య కాలంలో కూడా వెంకీ వరస విజయాలు అందుకుంటున్నాడు. తన తోటి హీరోలు ఒక్క హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో కూడా వెంకీ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయన నటించిన ఎఫ్ 2, వెంకీ మామ లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈయన సినిమాలు వరుసగా డిజిటల్ మీడియాలో విడుదల కావడం అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు.
నవంబర్ 25న వెంకటేశ్ నటించిన దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా అలాగే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హక్కులు దాదాపు రూ.38 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ గత సినిమా నారప్ప కూడా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక్కడే అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ఇదే విషయం వెంకీ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
తన అభిమానులకు తాను చేసే సినిమాలపై పెద్దగా అంచనాలు ఉండవని.. అలాంటి ఆశలు పెట్టుకోరని.. అందుకే తన ప్రయోగాలు తను హాయిగా చేసుకుంటాను అని చెప్పాడు. పైగా తన సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయాలి అనేది తన ప్లాన్ కాదని.. అనుకోకుండా జరిగింది అంటున్నాడు. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే కచ్చితంగా అక్కడే విడుదల చేస్తామని.. ఎఫ్ 3 అలాంటి సినిమానే అంటున్నాడు ఈయన. ఈ లెక్కన నారప్ప, దృశ్యం 2 కేవలం ఓటీటీ కోసమే వెంకీ చేశాడనే విషయం అర్థమవుతుంది. తక్కువ వర్కింగ్ డేస్‌లో సినిమాలు పూర్తి చేసి.. అత్యధిక లాభాలకు వీటిని ఓటీటీ సంస్థలకు ఇచ్చేశారు. ఈ రెండు సినిమాలను సురేశ్ బాబు దాదాపు 70 కోట్లకు బేరం పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్‌కు థియేటర్స్‌లో కూడా అంతా మార్కెట్ లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అగ్ర హీరో వెంకటేష్ మాటల్లో మనకు ఏది అవసరమో అదే దక్కుతుంది!
Star Heroes Theatres | స్టార్ హీరోలకే థియేటర్స్ పై నమ్మకం లేకపోతే ఎలా..?
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Nayanthara remuneration | గాడ్ ఫాదర్‌కు నయనతార పారితోషికం వింటే షాకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

