Bhool Bhoolayya-2 Movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా కెరీర్ ఫ్లాపులతోనే మొదలైంది. ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగు ఫ్లాపులు. ‘కంచె’ పర్వాలేదనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఆ తర్వాత ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టినా.. ‘అంతరిక్షం’ ఆ హిట్లకు బ్రేకులు వేసింది. ఇక ‘ఎఫ్-2’ సినిమా కోట్లు కొల్లగొట్టినా.. బారాన వంతు క్రెడిట్ వెంకీ మామకే దక్కింది. ఇక గతేడాది ఒళ్లు హూనం చేసుకుని కష్టపడిన ‘గని’ సినిమా తొలిరోజే అటకెక్కేసింది. ప్రస్తుతం వరుణ్ ‘గాంఢీవదారి అర్జున’ సినిమా చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక ఇదిలా ఉంటే వరణ్‌కు ఓ బాలీవుడ్ రీమేక్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. గతేడాది బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన ‘భూల్ భూలయ్య-2’ను తెలుగులో రీమేక్ చేసే ప్లాన్ ఉన్నాడట ఓ ప్రముఖ నిర్మాత. ఇక ఇందులో హీరోగా వరుణ్‌ను అనుకున్నారట. ఇప్పటివరకైతే ప్రాజెక్ట్ ఓకే కాలేదు కానీ.. వరుణ్‌తో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ సినిమానే కావచ్చు కానీ ఇక్కడ ఇది వర్కువుట్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి కథలను మనం ఇదివరకే ఎన్నో సార్లు చూశాం. పైగా ఈ సినిమాను కూడా ఓటీటీలో ఎంతో మంచి చూసేశారు.
కథ గొప్పగా ఏమి ఉండదు. స్క్రీన్ ప్లే కూడా అంత గ్రిప్పింగ్‌గా లేదు. అయితే ఈ సినిమాలో కామెడీ బాగా పడింది. అదే సినిమాను సక్సెస్ బాటలో నడిపింది. నిజానికి ఈ సినిమాలో ప్రధాన పాత్ర అంటే టబుదే. రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో టబు కూడా అద్భుతంగా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో టుబు క్యారెక్టరే.. కార్తిక్ రోల్ కంటే ఎక్కువ హైలేట్ అయింది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే తెలుగు రీమేక్ కోసం రమేష్ వర్మను రంగంలోకి దింపుతున్నారట. ‘రాక్షసుడు’ రీమేక్‌ను బాగా హ్యండిల్ చేశాడన్న పేరుతోనే ఈ హార్రర్ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ పట్టేశాడట. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజీలోనే ఉంది. మరీ ఈ రీమేక్‌కు వరుణ్ పచ్చ జెండా ఊపుతాడో? లేదో? చూడాలి.