Harish Shankar | టాలీవుడ్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉండటమే కాకుండా.. అప్పుడప్పుడూ వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. మరీ విసిగిస్తే కొన్నిసార్లు తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు టచ్‌లోకి వచ్చాడు హరీశ్ శంకర్. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు.
ఈ చిట్‌చాట్‌లో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించే ఎక్కువ హరీశ్ శంకర్‌ను అభిమానులు ఎక్కువగా అడిగారు. మరీ ముఖ్యంగా ఇది రీమేకా? ఒరిజినల్ స్టోరీనా అని ప్రశ్నించారు. దీనికి హరీశ్ శంకర్ చాలా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ” నా వర్క్ నిజంగా తెలిసిన వారు వాటిని రీమేక్‌లు అని పిలవడానికి సిగ్గుపడతారు. నాపై నమ్మకం ఉంచండి. సినిమా మీ అంచనాలకు మించి వుంటుంది” అని చెప్పాడు హరీశ్.
గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాకు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. అయితే గబ్బర్ సింగ్ రీమేక్ అన్నట్టే కానీ మన నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేయడంతో పాటు.. కథనాన్ని కూడా పవన్‌కు మేనరిజానికి తగ్గట్టు పూర్తిగా మార్చేశాడు. అది అభిమానులకు నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర గబ్బర్ సింగ్ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ చిత్ర థేరీకి రీమేక్ అని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఆమధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం అసలు థేరీకి సంబంధం లేకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసి సినిమాపై క్యురియాసిటీ పెంచేశారు.