Naga Chaitanya | నాగ చైతన్య భూల్ భూలయ్యా-2 రీమేక్ చేస్తున్నాడా.. క్లారిటీ ఇచ్చిన చై టీమ్
Actor Naga Chaitanya | ప్రస్తుతం నాగచైతన్య ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ తర్వాత ఇప్పటివరకు ఆయనకు సాలిడ్ హిట్ లేదు. నాగ్ తో కలిసి చేసిన బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోకుండానే వెనుదిరిగింది.
Actor Naga Chaitanya | ప్రస్తుతం నాగచైతన్య ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండేళ్ల క్రితం వచ్చిన లవ్ స్టోరీ తర్వాత ఇప్పటివరకు ఆయనకు సాలిడ్ హిట్ లేదు. నాగ్ తో కలిసి చేసిన బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోకుండానే వెనుదిరిగింది. ఇక థ్యాంక్యూ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అక్కినేని అభిమానులు సైతం ఈ సినిమా రిజల్ట్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా విడదులైన కస్టడీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది. కొన్ని ఏరియాల్లో పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో నాగచైతన్య ఇప్పుడు మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో చైతన్య కొత్త కథతో వెళ్లడం కంటే రీమేక్ స్టోరీతో సేఫ్ కావడం బెటర్ అని భావిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా గతేడాది బాలీవుడ్ లో కోట్లు కొల్లగొట్టిన భూల్ భూలయ్య-2 సినిమాను రీమేక్ చేస్తున్నట్లు తెగ చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై నాగచైతన్య టీమ్ స్పందించింది. రీమేక్ చేస్తున్న వార్తల్లో నిజం లేదని, వాటిని నమ్మొద్దని తెలిపింది. అంతేకాకుండా నాగచైతన్య సినిమాలకు సంబంధించిన ప్రకటనలు అఫీషియల్ గా తామే చెప్తామని, అంతవరకు ఎలాంటి న్యూస్ పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. దాంతో రీమేక్ పై వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చేసింది. ఇక నాగచైతన్య తన తదుపరి సినిమాను గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో సినిమా చేయనున్నాడు. దర్శకుడి ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ.. చైతూ ఈ సినిమాలో ఫిషింగ్ బోటు డ్రైవర్గా కనిపించబోతున్నట్టు తెలియజేశాడు. గుజరాత్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా ఉండబోతుందని టాక్. దీనితో పాటు నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ కు రెడీ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

