Mega156 | మెగా కాంపౌండ్‌లోకి అక్కినేని దర్శకుడు.. చిరు నెక్స్ట్ మూవీ అతనితోనేనా?
Mega156 Director | హ్యాట్రిక్ ఫ్లాప్‌ల తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చిరుకు తిరుగులేని విజయాన్నిందించింది.
Mega156 Director | హ్యాట్రిక్ ఫ్లాప్‌ల తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చిరుకు తిరుగులేని విజయాన్నిందించింది. ప్రస్తుతం చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలే క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా చిరు తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో అక్కినేని ఫ్యాన్స్‌కు మరిచిపోలేని హిట్లిచ్చిన కళ్యాణ్ కురసాల చిరు నెక్ట్స్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించనుందట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

