Director Maruthi | మారుతి విషయంలో ప్రభాస్ అభిమానులు చేస్తున్న ప్రధానమైన కంప్లైంట్ ఇదే. దానికి కారణం కూడా లేకపోలేదు. నిజానికి ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ భయంగానే ఉన్నారు. అంత మంది దర్శకులు లైన్లో ఉండగా ఇప్పటి వరకు స్టార్ హీరోలతో పని చేయని మారుతికి సినిమా ఇవ్వడం ఏంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయనకు మారుతి చెప్పిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ నచ్చడంతో.. అతడిని నమ్మి గుడ్డిగా ముందడుగు వేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న టెక్నీషియన్స్ కూడా ప్రభాస్ రేంజ్ కాదు.
వీలైనంత తక్కువ బడ్జెట్ లో.. తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదు.. లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో మాత్రం చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా మాస్టర్ ఫేమ్ మాళవిక మోహన్ ను ఎంపిక చేశారు. తమిళంలో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఈ భామను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు ప్రభాస్. ఈమెతో పాటు మరో హీరోయిన్ గా రిద్ధి కుమార్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక్కడే ప్రభాస్ అభిమానులకు మండిపోతుంది. ఆయన రేంజ్ ఏంటి ఆ హీరోయిన్లు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ‘లవర్’ సినిమాలో రాజ్ తరుణ్ తో నటించిన రిద్ధి కుమార్ ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ‘రాధే శ్యామ్’ సినిమాలో మాత్రం 5 నిమిషాలు కనిపించింది. అంత చిన్న హీరోయిన్ను ప్రభాస్ కు జోడిగా ఎంపిక ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని.. స్వయంగా ప్రభాస్ రికమెండ్ చేశాడు అనే వార్తలు వినిపించడం. ఏదేమైనా కూడా ప్రభాస్, మారుతి సినిమా విషయంలో మాత్రం అభిమానులు చాలా నిరాశలోనే ఉన్నారు.
ఈ సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదనే కోపం కూడా వాళ్లలో కనిపిస్తోంది. మొదలు పెట్టినప్పుడు చెప్పలేదు.. సినిమాలో ఎవరున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.. పైగా షూటింగ్ కూడా సైలెంట్ గా చేస్తున్నారు. వీటన్నింటికీ తోడు హీరోయిన్స్, టెక్నీషియన్స్ కూడా ప్రభాస్ రేంజ్ కాదు.. అందుకే తమ హీరో స్థాయిని మారుతి తగ్గిస్తున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. వాళ్ళ కోపం చల్లారాలంటే ప్రభాస్ కు మారుతి అదిరిపోయే హిట్ ఇవ్వాల్సిందే. అతనికి వేరే ఆప్షన్ కూడా లేదు.