Chiranjeevi | సమ్మర్‌ను టార్గెట్ చేసిన మెగాస్టార్.. ఈ సారైనా కలిసి వస్తుందా?
ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్‌కు ఈ సినిమా మెగా కంబ్యాక్ ఇచ్చింది. తోడుగా రవితేజ కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారుతుంది.
Bhola Shankar Movie | ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్‌కు ఈ సినిమా మెగా కంబ్యాక్ ఇచ్చింది. తోడుగా రవితేజ కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారుతుంది. పోటీగా ‘వీరసింహా రెడ్డి’, ‘వారసుడు’ వంటి పెద్ద సినిమాలున్నప్పటికీ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇటీవలే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక చిరు ప్రస్తుతం భోళాశంకర్ షూటింగ్లో నిమగ్నమయ్యాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాను చిరు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. అంతేకాకుండా మే 12వ తేదీని బుక్ చేసుకున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరుకు చెల్లెలి పాత్రలో నటిస్తుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా ‘ఆచార్య’ కూడా సమ్మర్‌ను టార్గెట్‌గా చేసుకొనే వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

