Irumudi | ఓటీటీ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సత్తా చాటింది. ముఖ్యంగా రవితేజను మాస్ హీరోగా మాత్రమే కాకుండా ఒక బలమైన ఎమోషనల్ నటుడిగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ కథలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ.. రవితేజతో ‘ఇరుముడి’ని తెరకెక్కించారు. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ పబ్లిక్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు స్థిరంగా కొనసాగాయి. ఇతర సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. ‘ఇరుముడి’ మాత్రం సుదీర్ఘంగా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. రవితేజ కెరీర్లో ఈ సినిమా మరో భారీ విజయంగా నిలిచింది. రవితేజ అంటే మాస్, కామెడీ, ఎనర్జిటిక్ యాక్షన్ అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అయితే ‘ఇరుముడి’లో శివ నిర్వాణ ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కుటుంబ బంధాలు, తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, భావోద్వేగాల చుట్టూ కథను నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ నటనలోని ఎమోషనల్ షేడ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుముడి’ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే స్ట్రీమింగ్ తేదీ, భాషల వివరాలపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో ‘ఇరుముడి’కి ప్రధాన బలంగా నిలిచిన అంశాల్లో రవితేజ నటనతో పాటు చిన్నారి నక్షత్రతో ఆయనకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించాయని టాక్ వచ్చింది.