Indra Movie Re Release | మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. ‘ఇంద్ర’ సినిమా రీ రిలీజ్
Indra Movie Re Release | మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ముందుంటుంది ఇంద్ర సినిమా. అప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ కావు.. మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమాతో మూయించాడు మెగాస్టార్.
Indra Movie Re Release | మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ముందుంటుంది ఇంద్ర సినిమా. అప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ కావు.. మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమాతో మూయించాడు మెగాస్టార్. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది.
చిరంజీవి కెరీర్లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకువచ్చింది. ఇంద్ర విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఇక ఆ రోజుల్లోనే రూ.2000 బ్లాక్‌లో పెట్టి అభిమానులు ఈ సినిమా చూశారంటే ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా మూవీలో వచ్చే షౌకత్ అలీఖాన్, మొక్కే కదా అని పీకేస్తే అనే డైలాగ్స్ అభిమానులను ఉర్రుతలు ఊగించాయి. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.
22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️
In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024
Also Read..
Vijay Devarakonda | విజయ్ లుక్ లీక్ అయ్యిందా.. కావాలనే లీక్ చేశారా.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

