Akshay Kumar | ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే గుండె ముక్కలవుతుంది : అక్షయ్ కుమార్
Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ని వరుస ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయి. గత రెండు ఏండ్లలోనే ఆయన నటించిన 8 సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క ఓ మై గాడ్ చిత్రమే హిట్ దక్కించుకుంది. ఇక రక్షబంధన్, రామ్ సేతు. బడేమియా చోటేమియా, మిషన్ రాణిగంజ్ వంటి చిత్రాలు అయితే అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాయి.
Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ని వరుస ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయి. గత రెండు ఏండ్లలోనే ఆయన నటించిన 8 సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క ఓ మై గాడ్ చిత్రమే హిట్ దక్కించుకుంది. ఇక రక్షబంధన్, రామ్ సేతు. బడేమియా చోటేమియా, మిషన్ రాణిగంజ్ వంటి చిత్రాలు అయితే అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఆయన నటించిన సర్ఫిరా అనే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకురాగా ఈ చిత్రం కూడా డిజాస్టార్‌గా నిలిచింది. సర్ఫిరా చిత్రంకు అక్షయ్ రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ ఉండగా.. ఈ మూవీకి రూ.3 కోట్లు కూడా రాకపోవడం షాకింగ్ విషయం. అయితే వరుసగా వస్తున్న ఫ్లాప్‌లపై అక్షయ్ తాజాగా స్పందించాడు.
ప్రతి సినిమా వెనుక చాలామంది కష్టం ఉంటుంది. దానిని ఎంతో ఇష్టంగా చేస్తాం. దానికోసం ప్రాణం పెడతాం. కానీ అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యినప్పుడు మన హృదయం ముక్కలవుతుంది. అయితే పరజయం చవిచూసిన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకోవాలి. అప్పుడే ఈసారి హిట్ కొట్టాలి అనే కసి పెరుగుతుంది. అదృష్టవశాత్తూ, నేను నా కెరీర్లో ముందుగానే దాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. సినిమా రిజల్ట్ కొన్ని సార్లు మనల్ని బాధించవచ్చు. అది మన కంట్రోల్లో లేనిది. కష్టపడి పని చేయటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. అలా నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలుపెడుతుంటాను. సినిమాల్లో నా అతిపెద్ద బలం నా క్రమశిక్షణ. ప్రతిసారి టైమ్-టేబుల్ని ఫాలో అవుతాను. చాలా ఏండ్లుగా ఫిట్‌గా ఉండటం వలనే నేను స్ట్రాంగ్‌గా ఉంటున్నాను. కరోనా తర్వాత చాలా మారింది. ప్రేక్షకులు కూడా కొత్త కథలను చూడడానికి ఇష్టపడుతున్నారు. వాళ్లకి తగ్గట్లుగా మనం కూడా మారాల్సి ఉంటుంది అంటూ అక్షయ్ వెల్లడించాడు.
Also Read..
- Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పూర్తయ్యేదెన్నడూ..? ప్రశ్నించిన హరీశ్‌రావు
- MLA Vivekananda | కొత్త నాటకానికి తెరతీసిన సీఎం రేవంత్: ఎమ్మెల్యే వివేకానంద
- Kamala Harris: తమిళనాడులోని పూర్వీకుల గ్రామంలో కమలా హ్యారిస్ పోస్టర్లు.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

