మన సినిమా ప్రపంచఖ్యాతి పొందాలి
మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమల్ హాసన్
‘మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమల్ హాసన్ ‘మరో చరిత్ర’ సినిమా ప్రతి నటుడికీ గైడ్ లాంటిది. ‘దశావతారం’ లాంటి సినిమా చేసేందుకు ఇప్పుడున్న ఏ నటుడికీ ధైర్యం చాలదు. ‘ఏక్ దూజే కేలియే’తో మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇవాళ గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. మూసను రూపుమాపిన నటుడు ఆయన. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ..’ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించాను. యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. ప్రతి పాత్ర హీరోలాగే అనిపిస్తుంది. ఇదొక చరిత్ర సష్టించాలని ఆశిస్తున్నా. విడుదలకు ముందే ఈ మాట చెప్పే ధైర్యం నాకు తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. తమిళంలో నేను నటించిన సినిమాల్లో చాలా అపజయాలు ఉన్నాయి. కానీ తెలుగులో నేను నటించిన కొన్ని చిత్రాలైనా ఎక్కువ శాతం విజయాలు దక్కాయి. నేను నటుడిగా సాధించిన ఏ ఘనతా నా ఒక్కడిది కాదు. మనవి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాలు కావాలి’ అన్నారు. ‘భారతీయ సినిమాకు కమల్ హాసన్ గర్వకారణం. ఆయన సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అన్నారు హీరో నితిన్. ఈ కార్యక్రమంలో దర్శకులు లోకేష్ కనకరాజ్, హరీష్ శంకర్, బుచ్చిబాబు, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.
ఆశ్చర్యపరిచిన అభిమాని: హైదరాబాద్ కు చెందిన చంద్ర అనే కమల్ హాసన్ అభిమాని ‘విక్రమ్’ సినిమా తొలి ఆట షో చూసేందుకు ఓ మల్టీప్లెక్స్ లో 60 టికెట్స్ ను కొనుగోలు చేశారు. ఈ టికెట్స్ చూపిస్తూ ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Global
- Indian
- Kaml Haasan
- movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

