Most Popular Directors of 2025 | ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులు వీరే.!
IMDB | సినిమాలకు సంబంధించి రేటింగ్, సమాచారం విషయంలో అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb), 2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన (Most Popular) భారతీయ స్టార్లు మరియు దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది.
IMDB | సినిమాలకు సంబంధించి రేటింగ్, సమాచారం విషయంలో అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb), 2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన (Most Popular) భారతీయ స్టార్లు మరియు దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించింది. అయితే ఈ జాబితాలో తెలుగు నుంచి ఒక్క దర్శకుడు కూడా చోటు దక్కించుకోకపోవడం విశేషం. ఇక ఐఎండీబీ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులు ఎవరు అనేది చూసుకుంటే.
సైయారాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి (Mohit Suri) ఈ ఏడాది మోస్ట్ పాపులర్ దర్శకులలో అగ్ర స్థానంలో నిలిచాడు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచాడు. కూలీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) మూడో స్థానంలో నిలువగా.. నిశాంఛీతో హిట్ అందుకున్న అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నాలుగో స్థానంలో ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో హిట్ అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఐదో స్థానంలో నిలిచారు. ఆమిర్ ఖాన్‌తో సితారే జమీన్ పర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న (R.S. Prasanna) ఆరో స్థానంలో నిలువగా.. మెట్రో ఇన్ డినోతో అనురాగ్ బసు (Anurag Basu) ఏడో స్థానంలో నిలిచాడు. మలయాళం కొత్త లోక సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు డొమినిక్ అరుణ్ (Dominic Arun) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకోగా.. ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) 9వ స్థానం, హోమ్ బౌండ్ చిత్రంతో నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaywan) 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

