రైడర్స్ ప్రయాణం

‘జీవితాన్వేషణలో నలుగురు బైక్ రైడర్స్ తెలుసుకున్న సత్యాలేమిటి? అపరిచితులైన వారి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది ఈ చిత్ర కథ’ అని అన్నారు గురుపవన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్యహోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ నిర్మాత. అక్టోబర్ 2న సినిమా విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రోడ్ జర్నీ అడ్వెంచరస్ చిత్రమిది. భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు బైక్ రైడర్స్ తమ గమ్యాన్ని ఎలా చేరుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథే హీరోగా నమ్మి రూపొందిస్తున్నాం. ప్రతి పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే చిత్రమిది’ అని తెలిపారు. పృథ్వీరాజ్, సప్తగిరి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: సునీల్ కశ్యప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

