Allu Arjun | పుష్ప-2 సెట్లోకి తీసుకెళ్లిన అల్లు అర్జున్.. ఇన్‌స్ట్రాగ్రామ్ స్పెషల్ వీడియో వైరల్
Icon Star Allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా సంచలన రికార్డు నెలకొల్పాడు. కాగా తాజాగా ఇన్స్టాగ్రామ్ సంస్థ బన్నీతో ఓ వీడియో చేసింది.
Icon Star Allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా సంచలన రికార్డు నెలకొల్పాడు. కాగా తాజాగా ఇన్స్టాగ్రామ్ సంస్థ బన్నీతో ఓ వీడియో చేసింది. ఆ వీడియో బైట్‌లో బన్నీ తన డైలీ యాక్టివిటీస్ గురించి చెప్పుకొచ్చాడు. ఉదయం లేచిన్నుంచి షూటింగ్ ముగిసే వరకు ఏమేం చేస్తాడో వీడియోలో వివరించాడు. ముందుగా ఆ వీడియోలో బన్నీ తన ఇంటి టూర్ వేశాడు. తన అవార్డులు, పొద్దున లేచి యోగా చేయడం, గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్‌ను చూపిస్తూ ఇలా ప్రతీ రోజు ఉదయం చాలా కామ్‌గా సాగిపోతుందని వెల్లడించాడు.
ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఉన్న పుష్ప-2 సెట్లోకి తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఫిలింసిటీలోకి ఎంటరవుతూ ‘ఇండియాలో అభిమానులు చాలా డిఫరెంట్. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అభిమానులు కనిపించరు. వీళ్ల అభిమానం మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం’ అంటూ సెట్లోకి ఎంటరయ్యే సమయానికి ఇరువైపులా ఉన్న ఫ్యాన్స్‌ను చూపిస్తూ.. వాళ్లను పలకరించాడు. ‘హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప-2 సినిమాకు ఇదే ఇల్లు’ అంటూ పుష్ప-2 సెట్లోకి తీసుకెళ్లాడు. ముందుగా బన్నీ క్యారెవాన్లోకి ఎంటరవడం ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ను పరిచయం చేయడం.. ఆపై పుష్ప కాస్ట్యూమ్స్, మేకపవడం, సీన్‌ను ఒకసారి చదవడం ఇలా కెమెరా ముందుకు వెళ్లే వరకు చేసే ప్రక్రియను చూపించాడు.
అంతేకాకుండా పుష్ప-2 మూవీ షూటింగ్ ఎలా సాగుతుందో కూడా ఈ వీడియో బైట్‌లో చూపించాడు. మూవీ కోసం వేసిన సెట్స్, అతడు సెట్లోకి ఎంటరయ్యే విధానం, సుకుమార్ యాక్షన్ చెప్పడం నుంచి కట్ చేసేంత వరకు షూటింగ్ సాగే తీరును చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇలా ఒక ఇండియన్ నటుడి డైలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన వీడియో బైట్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్ తీసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలో అవుతున్న ఏకైక ఇండియన్ సినిమా సెలబ్రెటీ అల్లు అర్జున్ అవడం విశేషం. ఇక అల్లు అర్జున్‌కు ఇన్స్ట్రాలో 21.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

