బాలీవుడ్ యాక్టర్లు రణ్ బీర్ కపూర్-అలియాభట్ (Ranbir-Alia Bhatt) 2017 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలోనే పెళ్లి (Marriage) పీటలెక్కబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను, రణ్ బీర్ పెళ్లి (Ranbir Alia Marriage) ఎప్పుడు చేసుకుంటారంటూ మీడియాలో వచ్చిన ఊహాగానాలతో విసిగిపోయానని చెప్పింది అలియాభట్. తన పెళ్లి అంశం ‘మానసిక స్థితి’కి సంబంధించినదని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ మీరు నిజాయితీ నేనెపుడు పెళ్లి చేసుకుంటానని అడిగితే..నేను ఇప్పటికే అతన్ని పెళ్లి చేసుకున్నా. ఆ విషయాన్ని మర్చిపోండి. నేను స్వీట్ లిటిల్ గాళ్‌గా ఉన్నపుడు స్క్రీన్‌పై మొదటిసారి చూసిన రోజే అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అది నా మానసిక స్థితి. నీవు నీ మైండ్..నీ మనస్సు..నీ రిలేషన్షిప్ లో ఉన్నపుడు..అంటూ చెప్పుకొచ్చింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మాస్త్ర (Brahmāstra) సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ వచ్చన్, మౌనీ రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.