ఏడాదిన్నర పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటానని ప్రకటించారు ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్. 35 ఏండ్లుగా విరామం లేకుండా నటిస్తున్నానని, కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోయానని ఆయన చెప్పారు. ఆమిర్ ఖాన్ ఇటీవల ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు.
ఈ సినిమా అపజయంతో ఆమిర్ ఖాన్కు కనీసం వంద కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీంతో నిరాశపడిన ఆమిర్ కొద్ది కాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…‘35 ఏండ్లుగా విరామం లేకుండా నటిస్తూ వచ్చాను. ఈ క్రమంలో కుటుంబంతో సమయాన్ని గడపలేదు. ఏడాదిన్నర పాటు నటన నుంచి విరామం తీసుకుంటా. నా కొత్త సినిమా ‘ఛాంపియన్స్’ నుంచి హీరోగా తప్పుకుంటున్నా. మరో స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రానికి నిర్మాతగా అన్నారు.