Rashmika mandanna | మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్‌పై రష్మిక
Aishwarya Rajesh | పుష్పలో పోషించిన శ్రీవల్లి పాత్ర రష్మిక (Rashmika mandanna)కు జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే అందాల భామ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పుష్పలో శ్రీవల్లి పాత్ర రష్మిక కంటే తాను బాగా చేసేదాన్నంటూ హాట్ కామెంట్స్ చేసింది.
Aishwarya Rajesh | పుష్ప సినిమాలో పోషించిన శ్రీవల్లి పాత్ర రష్మిక (Rashmika mandanna)కు జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే అందాల భామ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పుష్పలో శ్రీవల్లి పాత్ర రష్మిక కంటే తాను బాగా చేసేదాన్నంటూ హాట్ కామెంట్స్ చేసింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి డీ గ్లామరస్ పాత్ర నాకు బాగా సూట్ అయ్యేది. రష్మిక కంటే నేను ఆ పాత్రను బాగా చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అయితే పుష్పలో రష్మిక బాగా చేయలేదా? అని అడుగగా.. ఆమె బాగా చేయలేదని అనడం లేదని, తానైతే ఆ పాత్రకు కరెక్ట్ అని అభిప్రాయపడినట్లు తెలిపింది.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రష్మిక ఈ కామెంట్స్‌పై స్పందించింది. ఫ్రెండ్లీ నోట్ పోస్ట్ చేస్తూ.. ఐశ్వర్య ఏం చెప్పాలనుకుందో తనకు అర్థమైందని.. ఫర్హానా ఫేం నటి పట్ల తనకు గొప్ప అభిమానం తప్ప మరేమీ లేదని రాసుకొచ్చింది రష్మిక. హాయ్ లవ్.. ఇప్పుడే ఇది గమనించా.. విషయం ఏంటంటే – మీరు అనుకున్నది నాకు బాగా అర్థమైంది. మనల్ని మనం వివరించుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని కోరుకుంటున్నాను. మీకు తెలిసినట్లుగా.. మీ పట్ల ప్రేమ, గౌరవం మాత్రమే ఉన్నాయి. మీ ఫర్హానా చిత్రానికి మళ్ళీ ఆల్ ది బెస్ట్.. అంటూ ట్వీట్ చేసింది రష్మిక.
ఐశ్వర్య రాజేశ్, రష్మిక చాలా స్నేహపూర్వకంగా ఒకరి కామెంట్స్ మరొకరు సమర్థించుకోవడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐశ్వర్య నటించిన ఫర్హానా మూవీ శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
From the desk of Aishwarya Rajesh#AishwaryaRajesh @aishu_dil pic.twitter.com/J78oNsWQ9B
— Yuvraaj (@proyuvraaj) May 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

