Conrad K Sangma | గుణి మంచికంటి డైరెక్షన్లో యానిమల్ ఫేం మరాఠి యాక్టర్ ఉపేంద్ర లిమాయే లీడ్ రోల్లో నటిస్తోన్న మూవీ బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep). క్రైం కామెడీ జోనర్లో వస్తోన్న ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ విడుదల చేయగా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వినోదాన్ని పంచేలా సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి. పూర్తిగా మేఘాలయలో షూటింగ్ జరుపుకున్న తొలి సౌతిండియన్ మూవీగా బా బా బ్లాక్ షీప్ నిలిచిపోనుంది.
ఈ సందర్భంగా మేఘాలయ సీఎం కొన్రాడ్ కే సంగ్మా టీంకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. తెలుగు క్రైం కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్ షూటింగ్ పూర్తిగా మేఘాలయలో చిత్రీకరణ జరుపుకుందని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది.. వరల్డ్‌వైడ్‌గా 2026 అక్టోబర్ 9న విడుదల కానుంది. ఇది మేఘాలయకు గర్వించే సందర్భం. మా మేఘాలయ రాష్ట్రంలో షూటింగ్ జరుపుకున్న మొదటి సౌతిండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా.. మేఘాలయ భూతల దశ్యాలు, అందాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. మాకు ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక అవకాశం. మా యువత, స్థానిక ప్రజలు కొత్త స్కిల్స్ నేర్చుకొని కథలో భాగంగా తమ ప్రతిభను ప్రపంచానికి చూపించబోతున్నారు. మేఘాలయ ప్రాముఖ్యతను గుర్తించి చిత్రీకరణకు ఎంచుకున్నందుకు నిర్మాత వేణు దోనెపూడి చిత్రాలయం స్టూడియోస్‌తోపాటు చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అక్టోబర్ 9న సినిమా విడుదలవుతుంది.. మీ ఊహలను కెమెరాలో బంధించి స్క్రీన్‌పై మేఘాలయ అనుభూతిని ఆస్వాదించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు.
జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే క్యారెక్టర్‌తోపాటు మిగిలిన యాక్టర్లతో సాగే జర్నీ వినోదాన్ని పంచేలా ఉండబోతుందని ట్రైలర్ చెప్పేస్తుంది. ఈ చిత్రంలో టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట, ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఆరుగురు వ్యక్తుల ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఈ క్రమంలో వచ్చే కామెడీ, క్రైం లాంటి అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు.
“It is a proud moment for us, and my best wishes to the entire team.”❤️
Meghalaya Chief Minister Shri @SangmaConrad expresses his happiness over #BaaBaaBlackSheep being shot entirely in the state 🤩💥
— https://t.co/2T3X61n1V8
In cinemas on October 9th, 2026💥
@ChitralayamOffl @VenuDonepudi @ManchikantiGuni @swethadonepudi #KondalJinna #SatishMeka @Upendralimaye @AkLagusani @IamVishnuOi @AjayAbrahamGeo1 @arcado77 @sahisuresh @inagavijaykumar @saimaneendhar @manojvalluri #VaisakhNair @saregamasouth @Creatorkrish @MalviMalhotra @VismayaSri #KarthikeyaDev #TinnuAnand #GeorgeMaryan #SamreedheeAryal #Abhi #MSaiSriHarsha #VinodVarma @actor_bunty @ReviverCinemaz @YbrantCinemas @SLNMOVIEMAKERS @Subbucinemaa @AnnapurnaStdios
— Chitralayam Studios (@ChitralayamOffl) October 7, 2026
బా బా బ్లాక్‌షీప్ ట్రైలర్..