రాజ్యసభ సీటు రెండుసార్లు వద్దన్నా: సోనూ సూద్

ముంబై: ఆదాయ పన్నును ఎగవేసినట్లు వచ్చిన వార్తలను సినీ నటుడు సోనూ సూద్ ఖండించారు. సోనూ సూద్ ఛారిటీ సంస్థ అన్ని రూల్స్ను ఉల్లంఘించినట్లు ఆదాయపన్ను శాఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోనూ సూద్ నివాసాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను చట్టానికి కట్టుబడే పౌరుడిని అని తెలిపారు. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలను సమర్పించానని, వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, తన పాత్ర తాను పోషించినట్లు సోనూ సూద్ తెలిపారు. అయితే తనిఖీలు నిర్వహించిన ఐటీశాఖ అధికారులు తాను చేసిన పనులను మెచ్చుకున్నారని, తన పనితనానికి గుర్తింపు ఇచ్చినట్లు చెప్పారు. మీరెప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్లు, పేపర్వర్క్ను చూశారా అని ఐటీ అధికారుల్ని అడిగానని, తాము ఎప్పుడూ ఇలాంటి పేపర్ వర్క్ చూడలేదని వారు చెప్పినట్లు సోనూ సూద్ గుర్తు చేశారు. తనకు రెండుసార్లు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారని, కానీ ఆ ఆఫర్లను వదులుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు ఆయన తెలిపారు. దాతృత్వ పనులను ఆపలేదని, ప్రజలకు సేవ చేస్తూంటూనే ఉన్నానన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

