Niti Taylor | చిన్నప్పుడు కొన్ని నిమిషాలు చనిపోయి బతికా: నటి నితి టేలర్
Niti Taylor | ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది.
ముంబై: ప్రముఖ టీవీ నటి నితి టేలర్ తన బాల్యం గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తాను కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికానని చెప్పింది. ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో నితి టేలర్‌ను తన పోరాడే తత్వం గురించి ప్రశ్నించడంతో ఆమె చిన్న వయసు నుంచి ఎదుర్కొన్న సమస్యలను, వాటి నుంచి బయటపడిన తీరును గుర్తు చేసుకున్నారు.
‘నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చనిపోయాను. కొన్ని నిమిషాలపాటు చనిపోయి తిరిగి బతికాను’ అని నితి చెప్పింది. చిన్నప్పుడే చావును జయించాను కాబట్టి జీవితంలో ఇక దేన్నైనా ఎదుర్కోగలుగుతాను అని వివరించింది. చిన్న వయసులో డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయానని, ఆస్పత్రికి తీసుకెళ్తే నా గుండెలో రంధ్రం ఉందని వైద్యులు గుర్తించారని గుర్తు చేసుకుంది.
దాంతో తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ మానుకోవాల్సి వచ్చిందని, అంతేకాదు ఆయాసం వచ్చే ఏ పనులు తాను చేయలేకపోయానని నితి చెప్పింది. సమస్య నుంచి కోలుకున్న తర్వాత అన్ని చేయగులుగుతున్నానని తెలిపింది. ఇటీవల తాను ఇంటి నుంచి షూటింగ్‌కు బయలుదేరగానే ఓ మహిళ తన దగ్గరికి వచ్చి.. కరోనా లాక్డౌన్లో తండ్రిని కోల్పోయిన తాను చనిపోదాం అనుకున్నానని, కానీ మీ వ్లోగ్స్ చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ ఆలోచన విరమించుకున్నానని చెప్పిందని నితి వెల్లడించింది.
తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలనుగానీ, సంతోషాలనుగానీ అన్నింటిని సోషల్ మీడియా ద్వారా ఫోలోవర్స్‌తో పంచుకుంటానని, కష్టాల నుంచి బయటపడిన తీరును, సంతోషకరమైన సందర్భాలను తెలియజేస్తూ ఉంటానని నితి టేలర్ తెలిపింది. నేను సోషల్ మీడియాలో రాసుకున్న అలాంటి ఓ సందర్బమే ఆ మహిళకు ఉపయోగపడిందని నితి పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

